హిట్ కోసం ఎదురు చూస్తున్న 'రవి తేజ' !

Balupu movie

హిట్ కోసం ఎదురు చూస్తున్న 'రవి తేజ' !

వరుస ప్లాఫ్ లను ఎదురుకుంటున్న టాలీవుడ్ హీరో రవి తేజ తన ఆశ లన్ని ఈ నెల 28న విడుదల కానున్న  'బలుపు' సినిమా మీద పెట్టుకున్న్నారు. మినిమమ్ గ్యారంటి తో నడిచే ఇతని సినిమాలు ఈ మద్య బాక్స్ ఆఫీసు వద్ద ఘోర పరా జయాన్ని చవి చూచాయి. తను హీరో గా నటించిన  'మిరపకాయి'  చిత్రం తరువాత రవి తేజ కు చెప్పుకో తగ్గ హిట్ చిత్రం లేదు . ఫై గా మాస్ మహారాజ లాంటి బిరుదులు తగిలించుకున్నా , తన నటన చూచి ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారు. పోనీ తన నటన మార్చుకుని సీరియస్ హీరో పాత్రలు చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో తెలియదు . కులుకుల మహారాజ్ గా ముద్ర పడ్డ తరువాత ఆ ఇమేజ్ లోనుంచి బయటకు రాలేక పోతున్నాడు రవి  తేజ . తన కేరీర్లో చెప్పుకో దగ్గ పాత్ర  బహుశా విక్రమార్క లో  'రాథోడ్' పాత్ర మాత్రమే సీరియస్ పాత్రగా మి గిలింది . ఏది ఏమైనా బలుపు చిత్రం ఫై రవి తేజ భవిషత్ ఆధారపడివుంది . శృతి హాసన్ ఈ సినిమాలో పూర్తిస్థాయి గ్లామర్ పాత్ర పోషించనుంది. అంజలి రెండో హీరోయిన్. థమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రం పి.వి.పి సినిమా బ్యానర్ పై భారీ బడ్జెట్ లో రూపుదిద్దుకుంది


Tags: Telugu Cinema News, Telugu Movie News, Tollywood

హిట్ కోసం ఎదురు చూస్తున్న 'రవి తేజ' !  హిట్ కోసం ఎదురు చూస్తున్న 'రవి తేజ' ! Reviewed by Upcoming Models on 5:19 PM Rating: 5

No comments: