త్వరలో పూర్తి కానున్న తనీశ్ 'బ్యాండ్ బాజా' !


త్వరలో పూర్తి కానున్న తనీశ్ 'బ్యాండ్ బాజా' ! 

తనీశ్, రూపల్ జంటగా రూపొందుతున్న చిత్రం 'బ్యాండ్ బాజా'. ఎ.యస్. ప్రొడక్షన్స్ పతాకంపై షేక్ నయీమ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగేశ్ దర్శకుడు. నాగమల్ల శంకర్ సమర్పిస్తున్నారు. రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. ఈ సంగతిని నిర్మాత నయీమ్ తెలియజేస్తూ "రెగ్యులర్ లవ్ స్టోరీలకు భిన్నంగా పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తయారవుతోంది. ఇప్పటివరకు లవర్ బాయ్‌గా కనిపించిన తనీశ్ మొదటిసారిగి ఫుల్ ఎనర్జిటిక్ కేరక్టర్ చేస్తున్నారు. ఇది నగర, పల్లె నేపథ్యాల మేళవింపుతో, అనేకమంది పెళ్లిళ్లతో ముడిపడిన ఓ వైవిధ్యభరిత వినోదాత్మక చిత్రం'' అని చెప్పారు. దర్శకుడు నాగేశ్ మాట్లాడుతూ "విజయ్ కురాకుల సంగీత సారథ్యంలో అందమైన పాటలు కుదిరాయి. మిగిలిన రెండు పాటల్ని చిత్రీకరించేందుకు వచ్చే వారంలో బ్యాంకాక్ వెళ్తున్నాం'' అని తెలిపారు.

 

Tags: Telugu News, Movie News, Telugu Movie News, Telugu Cinema News, Tollywood
త్వరలో పూర్తి కానున్న తనీశ్ 'బ్యాండ్ బాజా' ! త్వరలో పూర్తి కానున్న తనీశ్ 'బ్యాండ్ బాజా' ! Reviewed by Upcoming Models on 5:44 PM Rating: 5

No comments: