'మాయదారి మల్లిగాడు' గా సుధీర్ బాబు !

Mayadari Malligadu Muhurtham shot


కృష్ణ నటించిన 'మాయదారి మల్లిగాడు' ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో విదితమే. తాజాగా అదే పేరుతో సుధీర్‌బాబు ఓ చిత్రంలో నటిస్తున్నారు. తాజా చిత్రం బుధవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. గ్రేట్ ఆంధ్రా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యమ్.రేవన్ కుమార్ నిర్మిస్తున్నారు. హనుమాన్ దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి లక్ష్మీ మంచు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. సూపర్‌స్టార్ కృష్ణ క్లాప్‌నిచ్చారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత రేవన్ కుమార్ మాట్లాడుతూ "జూలై 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ చేస్తాం. మూడు షెడ్యూళ్లలో సినిమా పూర్తవుతుంది. హైదరాబాద్‌లోనే చిత్రీకరిస్తాం'' అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ "నా పదేళ్ల కృషి ఈ సినిమా. సిటీలో జరిగే కథ ఇది. కృష్ణగారి 'మాయదారి మల్లిగాడు'కు, మా సినిమాకు టైటిల్ తప్ప మరే సంబంధం లేదు'' అని చెప్పారు. బ్యూటీఫుల్ సినిమా అని సంగీత దర్శకుడు రధన్ అన్నారు. ఈ చిత్రానికి రచయితలు: వెలిగొండ శ్రీనివాస్, సవ్యసాచి శ్రీనివాస్, కళ: కిరణ్‌కుమార్, ఎడిటింగ్: మార్తాండ్.కె.వెంకటేష్, కెమెరా: బి.ఎల్.సంజయ్, సంగీతం: రధన్, నిర్మాత: యమ్.రేవన్‌కుమార్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హనుమాన్.


Tags: Film News, Telugu Cinema News,Movies News, Tollywood
'మాయదారి మల్లిగాడు' గా సుధీర్ బాబు ! 'మాయదారి మల్లిగాడు' గా సుధీర్ బాబు ! Reviewed by Upcoming Models on 7:43 PM Rating: 5

No comments: