తుక్కుకింద చారిత్రక రాజమండ్రి బ్రిడ్జి రైల్వే శాఖ నిర్ణయం !

113 ఏళ్ల క్రితం గోదావరిపై మొట్టమొదటగా రాజమండ్రి వద్ద నిర్మించిన హేవలాక్ బ్రిడ్జిని రైల్వే శాఖ తుక్కుకింద అమ్మి సొమ్ము చేసుకోవడానికి రెడీ అయింది. వందేళ్ల పాటు సేవలందించిన..  ఈ బ్రిడ్జి సర్వీసు పూర్తికావడంతో రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. అప్పటినుంచి తుక్కఖాతాలో చేర్చేందుకు రైల్వే బోర్డు  ప్రయత్నిస్తూనే ఉంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా రైల్వే బోర్డు బ్రిడ్జి అంశాన్ని తెరమీదికి తెచ్చింది. నష్టాలను పూడ్చుకునేందుకు హేవలాక్‌ బ్రిడ్జిని 67 కోట్ల రూపాయలకు వేలం పెట్టింది. 

ఈ వార్త విన్న రాజమండ్రివాసులు అవాక్కయ్యారు. తేరుకుని  పురాతన కట్టడంగా బ్రిడ్జిని కాపాడుకునేందుకు ఉద్యమబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లక్ష రూపాయలు ఇస్తామంటోంది. ప్రభుత్వ వైఖరి హాస్యాస్పదంగా ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి బ్రిడ్జిని కూల్చకుండా  చర్యలు తీసుకుని.. రాజమండ్రి వాసులకు కానుగా ఇవ్వాలని, పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.గతంలో 5 కోట్లుకు తుక్కు ఖాతాలో చేర్చుతామన్న రైల్వే శాఖ ..ఉన్నట్లుండి 67 కోట్లకు బేరం పెట్టింది..అయితే ..బ్రిడ్జిని చారిత్రక కట్టడంగా భావించి..వేలం నిర్వహించ వద్దని రైల్వే శాఖను కోరుతున్నారు.

Taga: Telugu News, News, Andhra News
తుక్కుకింద చారిత్రక రాజమండ్రి బ్రిడ్జి రైల్వే శాఖ నిర్ణయం ! తుక్కుకింద చారిత్రక రాజమండ్రి బ్రిడ్జి రైల్వే శాఖ నిర్ణయం ! Reviewed by Upcoming Models on 1:27 AM Rating: 5

No comments: