శ్రీకాంత్ హీరోగా రాజరాజేశ్వరీ పిక్చర్స్ పతాకంపై రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి 'మొండోడు' అనే టైటిల్ ఖాయం చేశారు. జర్నలిస్ట్ ప్రభు దర్శకునిగా పరిచయమవుతున్నారు. "రాజు కన్నా మొండోడు బలవంతుడు అన్న సామెత చందాన ఈ చిత్రంలో కథానాయకుడు కూడా మంచి కోసం, తనకు నచ్చిన పని చేయడం కోసం, తనను నమ్మిన, తాను నమ్మిన వారికోసం ఎంతకైనా తెగించే మనిషి. ఆ పాత్ర స్వభావాన్ని బట్టే 'మొండోడు' అనే పేరు ఖాయం చేశాం. యాక్షన్, సెంటిమెంట్ నేపథ్యంలో ఓ వైవిధ్యమైన కథతో ఈ సినిమా తయారవుతోంది'' అని ప్రభు చెప్పారు. నిర్మాత శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ "ఈ నెల 30తో షూటింగ్ పూర్తవుతుంది. ప్రస్తుతం ఫిల్మ్‌సిటీలో డాన్స్‌మాస్టర్ స్వర్ణ ఆధ్వర్యంలో శ్రీకాంత్‌పై ఓ గీతాన్ని చిత్రీకరిస్తున్నాం. 28 నుంచి డబ్బింగ్ పనులు మొదలుపెడతాం. జూలై నెలాఖరున లేదా ఆగస్ట్ ప్రథమార్ధంలో చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని తెలిపారు. పోసాని కృష్ణమురళి, చిత్రం శ్రీను, రవివర్మ, కారుమంచి రఘు, డా. రవిప్రకాశ్, ప్రభు తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: కాసర్ల శ్యామ్, సంగీతం: సాయికార్తీక్, ఛాయాగ్రహణం: వి. శ్రీనివాసరెడ్డి, సమర్పణ: జ్యోత్స్నారెడ్డి.
Tags: film news, telugu cinema news, movie news, tollywood
Tags: film news, telugu cinema news, movie news, tollywood
'మొండోడు' గా మారిన శ్రీకాంత్ !
Reviewed by Upcoming Models
on
8:17 PM
Rating:
No comments: